•  

సెక్స్ వల్ల మెదడులో రక్తస్రావం?

Sex can give people Fatal Brain haemorrhages
 
సెక్స్ వల్ల సంభవించే ప్రమాదంపై శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఉద్రేకపూరితమైన సెక్స్ వల్ల కొంత మందిలో మెదడులో రక్తస్రావం జరగవచ్చునని అంటున్నారు. అయితే, ఇది అందరి విషయంలో జరగదని అంటూ ఓ ఉపశమనం కలగించారు. స్ట్రోక్స్ ప్రమాదం ఉన్న వ్యక్తుల విషయంలోనే ఈ ప్రమాదం ఉంటుందని వారంటున్నారు. బలహీనమైన రక్తనాళాలతో లేదా అనియూరైజంతో బాధపడుతున్నవారికి ఆ ప్రమాదం సంభవించవచ్చునని అంటున్నారు.

సెక్స్ చేసినప్పుడు ప్రమాదం సంభవించే స్థాయి 4.3 శాతం ఉందని డచ్ శాస్త్రవేత్తలు తేల్చారు. ముక్కులో నుంచి రక్తస్రావం కావడం కూడా ప్రమాదమేనని, ఇందుకు 5.4 శాతం అవకాశాలున్నాయని చెప్పారు. కాఫీ సేవనం, కఠినమైన వ్యాయామం, కోలా సేవనం, ఆగ్రహం చెందడం వంటివి కూడా ప్రమాదకమైనవేనని అంటున్నారు. వాటన్నింటి వల్ల అకస్మాత్తుగా ఒత్తిడి పెరుగుతుందని యుట్రెచ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మోనిక్ వ్లాక్ అన్నారు.

English summary
The peril does not affect everyone - only those prone to a certain kind of stroke, according to researchers.But tragically most probably will not know they are susceptible until too late.
Story first published: Saturday, May 7, 2011, 16:02 [IST]

Get Notifications from Telugu Indiansutras