తాను ప్రేరేపింపబడ్డానన్న ఆనందం ప్రత్యక్షమైనది. తన భార్యను కూడా ఆనందింప జేస్తున్నానన్న ఆనందం పరోక్షమైనది. ఆ సమయంలో అతడికి తన ఆనందం కన్నా ఆమె ఆనందమే ప్రాముఖ్యత వహిస్తుంది. తన ఆనందం మరుగున పడిపోతుంది. ఒక విధంగా అతని లక్ష్యం ఆమె ఆనందం మీదనే కేంద్రీకరించబడటం వల్ల తన ఆనందం కోసం పట్టించుకోడు. ఈ పరోక్ష వైఖరే అతని ఉద్రేకాన్ని అదుపులో ఉంచుతుంది.
తన భార్యలో కామోద్రేకాన్ని విజయవంతంగా ప్రేరేపించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అతని దృష్టి ఎంతసేపూ ఆమె పొందే ఉద్రేక స్షాయిలోని హెచ్చుతగ్గుల్ని గమనించడంలోనే లగ్నమయి ఉంటుంది. కనుక ఆదే సమయంలో ఆ సాన్నిహిత్యంవల్ల తాను పొందుతున్న సుఖం గూర్చిన ఆలోచన రాదు. ఈ రెండు ఒక్కసారిగా ఏ మనిషి మెదడులో స్ఫురించడం జరగదు. ఆమెలో తన వల్ల కలిగే ఉద్రేక స్థాయి మీదనే అతని దృష్టి ఉండటం వల్ల అతని ఉద్రేకం అదుపు తప్పి పోదు. ఈ విధంగా అతని ఉద్రేకం అతనికి ప్రత్యక్షానందాన్ని కలిగించడానికి బదులు పరోక్షమైన ఆనందాన్ని కలిగిస్తుంది.