కన్నెపొర లేనంత మాత్రాన ఎలా అయితే కన్య కాదని భావించవద్దో అలాగే కన్నెపొర చినగనప్పటికీ కన్యగా పోల్చుకోవడం కూడా తప్పేనంట. కొందరు యువతులలో కన్నెపొరకు సాగే గుణం ఉంటుందంట. కాబట్టి సెక్సులో పాల్గొన్నప్పటికీ కన్నెపొర చినగకుండా సాగుతుంది. దీనికి కన్నెపొర చినగకుండా గర్భవతులు అయిన వారు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నారంట.
స్త్రీ కన్యత్వంలో కన్నెపొర ప్రాధాన్యత ఉంటుందా అంటే అందరూ కన్యత్వాన్ని కన్నెపొరకు సంబంధం పెడతారు. ఒక అమ్మాయి కన్నెపొర చినిగిందంటే కన్యత్వం పోయినట్టేనని భావిస్తారు. కన్నెపొరనే కన్యత్వానికి సాక్ష్యమనే అభిప్రాయం కేవలం మన దేశంలోనే కాదు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే కన్నెపొర చినిగి పోవడానికి అమ్మాయి కన్యత్వానికి ఏమాత్రం సంబంధం లేదంట. యువతి కన్యత్వానికి కన్నెపొరకు ఏమాత్రం సంబంధం లేదు. అది అసలు ప్రమాణమే కాదు. అమ్మాయిలు అడటం వల్ల, ఎగరటం వల్ల లేదా వ్యాయామం వల్ల కన్నెపొర చినిగి పోయే అవకాశాలు ఎక్కువ. అలాంటప్పుడు కన్నెపొరకు కన్యత్వానికి సంబంధం ఎలా ఉంటుంది.