కొంత మంది స్త్రీలలో సెక్స్ పట్ల వైముఖ్యం కలడానికి గల కారణాలను కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సెక్స్‌ పట్ల స్త్రీల వైముఖ్యం వల్ల దాంపత్య జీవితం సుఖమయంగా సాగదు. వైముఖ్యానికి గల కారణాలను తెలుసుకుని సరిదిద్దుకుంటే దాంపత్య జీవితానికి మంచిది. సెక్స్‌ పట్ల స్త్రీ వైముఖ్యానికి గల కారణాలు ఇలా ఉన్నాయి - ఆమెకు భావప్రాప్తి కలగకపోవడం, సెక్స్ వల్ల సంతృప్తి కలగకపోవడం, రతి బాధాకరంగా ఉండడం, భర్త శరీరం పట్ల ఆకర్షణ లేకపోవడం.
అవే కాకుండా మరికొన్ని కారణాలను కూడా నిపుణులు చూపిస్తున్నారు. భర్త ఇతర స్త్రీలతో తిరుగుతున్నాడనే అనుమానం కూడా స్త్రీ సెక్స్ పట్ల వైముఖ్యం ప్రదర్శించడానికి కారణమవుతుందని అంటున్నారు. పెళ్లయి కాపురానికి వచ్చిన తర్వాత సెక్స్ పట్ల జుగుప్స ఏర్పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. పెళ్లికి పూర్వం తల్లిదండ్రుల ఇచ్చిన శిక్షణ కూడా అందుకు కారణమవుతుందట. ఈ విషయాలను స్త్రీలు గమనించి, జాగ్రత్తగా మసులుకుంటేనే దాంపత్య జీవితం సుఖంగా కొనసాగుతుంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.