•  

స్నేహము, కామము కలిస్తే ప్రేమ

Love arises from Friendship
 
స్నేహము, కామమూ కలిసిన మిశ్రమ రూపాన్నే ప్రేమ అనవచ్చని హేవలాక్ ఎల్లీస్ నిర్వచించారు. ఆకర్షణతో కూడిన ఒకానొక అనుభూతి యిది. ఆత్మార్పణతో నిండి ఉంటుంది. అనురాగం, గౌరవం, భక్తి, సానుభూతి, సంరక్షక భావాలు - వీటిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఇవన్నీ ప్రస్ఫుటంగా అందరికీ కనిపించేవే. పిల్లల్లో కూడా ఇవి ఉంటాయి. కానీ చిన్న వయసులో ఇవన్నీ వాళ్ల తల్లిదండ్రులయందూ, స్నేహితులయందు, పెంపుడు జంతువులయందు ప్రకటిస్తారు.

యవ్వనం వచ్చేసరికి ఇవే తమ వయసుకు చెందిన స్త్రీ, పురుషులవైపు పరుగెడుతాయి. ఈ అనురాగంలో కొంతవరకు గౌరవం, భక్తి ఇమిడి ఉంటాయి. అయినా వీటి వెనుక అవ్యక్తమైన కామవాంఛ కూడా ఉంది. ఈ నాలుగింటినీ కలిపి ప్రేమ అంటాము. కేవలం కామం మీదనే ఆధారపడ్డ వివాహం కూడా దుఖాన్ని కలిగిస్తుంది.

English summary
Love will come from friendship and desire said Hevalack Ellies. Sex desire will come up behind respect.
Story first published: Wednesday, April 6, 2011, 16:39 [IST]

Get Notifications from Telugu Indiansutras