కనుక సాయంత్రం తడిపి ఆరవేసుకొని మర్నాటి ఉదయం ఇస్త్రీ చేసుకోవాలి. రాత్రి బట్టలు పగలు కట్టుకోకూడదు. డాగులూ, మరకలూ ఉంటాయి. వాటిని కూడా ఉదయమే తడిపి ఆరవేసుకొని ఆ తర్వాత ఈస్త్రి చేసుకొని మళ్లీ రాత్రికి సిద్ధం చేసుకోవడం మంచిది. స్త్రీలు రాత్రివేళ జాకెట్లను వదులుగా తొడుక్కోవడమే మంచిది.
చాలామంది రాత్రి, పగలు కూడా నడుము వరకు బట్టలు కట్టుకునే ఆచారం ఉంది. ఆధునికులు సూటూ, బూటూ పగలు ధరించినా రాత్రివేళ పైజామా, లాల్చి ధరించడం అలవాటున్నది. స్త్రీలు బిళ్ల గోచి పెట్టి, చీర ధరించడం అలవాటు. ఆధునిక స్త్రీలు లంగాపై గూడుకట్టుగా చీరకట్టుకోవడం, బాడీ మీద జాకెట్టు తొడగటం పగలు జరుగుతుంది. కార్తివేళ కేవలం లంగా జాకెట్టు వుంటే చాలు. పైజామాలు, లంగాలు, చీరలు వీటిని బిగుతుగా కట్టుకున్నందువలన నడుము చుట్టూ చర్మం నల్లబడి, పుళ్లు పడటం జరుగుతుంది. దీనివలన వంటి సొసే నశించి పోతుంది. కనుక బొందులు, రబ్బరు తాళ్లు వాడినట్లైతే తగినంతగా సాగుతాయి. కనుక ఇబ్బంది వుండదు. పగలు కట్టుకున్న బట్టలే రాత్రి కట్టుకోకూడదు. వంటింటి పొగ, దుమ్ము చెమట వాసన వీటికంటి పెట్టుకొని ఉంటుంది.