•  

అతిగా సిగ్గుపడితే అందం కాదట

Men like strong Women
 
పురుషులు స్ట్రాంగ్ వుమెన్‌ను ఇష్టపడతారని నిపుణలు చెబుతున్నారు. బలమైన సొంత వ్యక్తిత్వం, సొంత అభిప్రాయాలు ఉన్న మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడతారని అంటున్నారు. చొరవ ప్రదర్శించే స్త్రీల పట్ల కూడా మక్కువ ఎక్కువేనట. అయితే, ఇది మితిమీరితే వికటిస్తుందని అంటున్నారు. ఎక్కువ దూకుడుగా కనిపించినా, సిగ్గుతో పూర్తిగా తల వంచుకుని అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపించినా పురుషులు ఇష్టపడరని చెబుతున్నారు.

హుందాతనం, ఆత్మగౌరవం కొట్టిచ్చినట్లు కనిపిస్తే చాలునట, అదే అత్యంత అందంగా దర్శనమిస్తుందని చెబుతున్నారు. ఎంత అందం ఉన్నా అవి లేకపోతే ఆ అందానికి వన్నె రాదని అంటున్నారు. సులభంగా లభ్యమయ్యేది కూడా పురుషుడికి ఇష్టం ఉండదట. అయితే, అనవసరమైన దూకుడును ప్రదర్శించాల్సిన అవసరం లేదు. స్త్రీలు తనను అదుపు చేసుకుంటూ పురుషుడిని నిరీక్షణలో పెట్టాలని చెబుతున్నారు. ఇష్టంగా కనిపించే పురుషుడిని పెళ్లి చేసుకుంటున్న మహిళలు అతనిలో పరిపూర్ణతను ఆశించవద్దని చెబుతున్నారు. అయితే, సంబంధాలను కాపాడుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నించాలని, అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

English summary
The general consensus is that men get intimidated by strong, opinionated women who pose a challenge. But the truth is that any extreme is a turnoff. Whether you are the super aggressive sort or the dreamy, shy type, extreme behaviour signals insecurity.
Story first published: Saturday, April 2, 2011, 17:37 [IST]

Get Notifications from Telugu Indiansutras