సర్వేలో పాలుపంచుకున్న టీనేజ్ యువత సెక్స్ సంబంధాలకన్నా ఆలింగనాలు, చుంబనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారని, ముఖ్యంగా పురుషులు సెక్స్ సంబంధాలపై మక్కువ చూపడం లేదని తమ సర్వేలో తేలినట్టు లండన్‌కు చెందిన బేయర్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆలింగనాలు, ముద్దుల విషయంలో పురుషులు మహా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇష్టపడిన అమ్మాయి ఏ కుర్చీలోనో కూర్చొని వున్నపుడు అందరి కళ్లుగప్పి చటుక్కున కౌగలించుకోవడం, లిప్‌ టు లిప్ ముద్దును రుచి చూపించడం చేస్తున్నారట.
ఆధునిక కాలంలో యువతీయువకుల ప్రేమ వ్యవహారాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రేమలో పడిన యువత సెక్స్ కన్నా ముద్దూముచ్చటకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఒక సర్వేలో తేలింది. తమకు లభించే ఏకాంత సమయంలో ముద్దులు, కౌగలింతలు, చిలిపి చేష్టలతోనే ఎక్కువ ఆనందం పొందుతున్నట్టు తేలింది. వీటికి ఇచ్చే ప్రాధాన్యత సెక్స్‌కు ఇవ్వడం లేదని ఆ సర్వే వెల్లడించింది.