వివాహం కాక మునుపు సెక్స్ సంబంధిత అంశాలను తెలుసుకోని వారిలో ఎక్కువగా ఈ భావన ఉంటుందంటున్నారు. దీనితోపాటు సెక్స్ పట్ల విముఖతను కల్గించడానికి వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. రతి అనేది కొందరి మహిళల మదిలో అది ఓ భయంకరమైన అనుభవం. ఇక పురుషుల విషయానికి వస్తే... భాగస్వామిని సంతృప్తి పరచడంలో విఫలమైతే భార్య వద్ద లోకువవుతామనే సందేహం వారిని సెక్స్ చేయనీయదు. ఇటువంటి చిన్నచిన్న సమస్యలే చివరికి జంటలను విడదీస్తాయి. ఈ సమస్యలను పరిష్కరించుకుంటే భార్యాభర్తల మధ్య శృంగార జీవితం ఆనందమయంగానూ దాంపత్యం మెరుగ్గానూ ఉంటుంది.
కొంత మంది స్త్రీపురుషులు సెక్స్ విషయానికి వచ్చేసరికి అదేదో చేయరాని పనిలా జంకుతుంటారు. దాన్నో నేరంగా చూస్తుంటారు. మరికొందరైతే అసలు సెక్స్ చేయడమే తప్పని భాగస్వామిని దూరంగా ఉంచుతారు. దీంతో పడక గది భరించలేకుండా తయారవుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు విడాకులకు దారి తీస్తాయి. సెక్స్‌ను నేరంగా చూడడానికి కారణం సామాజిక కట్టుబాట్లు, నైతికంగా పెట్టిన నియమనిబంధనలు అంటారు. తరతరాలుగా స్త్రీ పురుషులు సెక్స్ గురించి మాట్లాడుకోవడం తప్పుగా భావించడం కూడా కారణమంటున్నారు సెక్సాలజిస్టులు.