
ప్రేమను కాపాడుకోవాలని చైతన్యపూరితమైన నిర్ణయం తీసుకోవాలట. మీ భాగస్వామి పట్ల మిమ్మల్ని ఆకర్షితులను చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టి, ఆమెకు లేదా ఆయనకు ఇష్టమైన రెస్టారెంట్లు, ఇతరాత్రా ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా దంపతుల మధ్య రోమాన్స్‌ను సజీవంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇద్దరూ కలిసి చేయాల్సిన పనులపై ముందుగానే ఒక కార్యాచరణ రూపొందించుకుని వాటిని పూర్తి చేసేందుకు రెండు, మూడు రోజుల పాటు తమతమ కొలువులకు సెలవు పెట్టి కలిసి చేస్తే ఎంతో మంచిది. ఈ సెలవుల్లో తమకు ఇష్టమైన ప్రదేశాలు, ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మరీ మంచిదని చెపుతున్నారు.
తమ భవిష్యత్ కోసం ప్రణాళికలను వెంటనే పూర్తి చేయడం మొదలు పెట్టాలి. మీ భాగస్వామికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పించవచ్చు. మీ భాగస్వామి ధరించే దుస్తుల పట్ల ఇష్టాన్ని ప్రదర్శించవచ్చు. శారీరకంగా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేయండి. దుస్తులు ధరించడం మీ భాగస్వామికి ఇష్టమయ్యేలా ఉండాలి. వెంటనే ఇది ఫలితం చూపకపోయినా దీర్ఘకాలంలో ఫలితం ఇస్తుందని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications




