ఇటీవలే బ్రిటన్‌లో దంపతుల సమయంపై జరిగిన ఓ సర్వేలో రోజు మొత్తంలో తాము కలిసి విషయాలను కలబోసుకుంటూ ఉండే సమయం 15 నిమిషాలు మాత్రమే అనే విషయాన్ని అని వందలాది దంపతులు బయటపెట్టారు. పని ఒత్తిడి కారణంగా, విశ్రాంతి సమయం కొరవడిన కారణంగా, లైంగిక జీవితంలో జడత్వం కారణంగా ఐరోపాలో, అమెరికాలో, జపాన్ తదితర పారిశ్రామిక దేశాల్లో సంతానోత్పత్తి కూడా తగ్గినట్లు గమనించవచ్చు. ఈ స్థితి ఆసియా దేశాలకు ఇప్పటికిప్పుడే వర్తించక పోయినా దంపతులు జీవితంలో అతి ముఖ్యభాగమైన లైంగిక సంబంధాలు దెబ్బ తినే ప్రమాదం ఉందనే వార్తలు చూస్తూనే ఉన్నాం.
దంపతులు ఇరువురూ పనిచేస్తున్న సందర్భాల్లో అయితే వారు కలుసుకునే క్షణాలు అరుదైపోతున్నాయి. షిప్టుల విభజనలో భార్య ఒక షిప్టు, భర్త ఒక షిఫ్టుగా విడిపోయే రకం పనుల్లో అయితే ముఖాముఖాలు చూసుకోని పరిస్థితి కూడా ఉంది. టీవీ, ఇంటర్నెట్ వంటి కొత్త దాడులపై దంపతులు దంపతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లైంగిక జీవితం గడిపేందుకు తగిన శక్తిని కోల్పోతే ఆ ఆసక్తే మన జీవితాల్లో మిగలకుండా పోయే ప్రమాదం ఉంది.