•  

సెక్స్ పై ఘర్షణను నివారించండి

Intercourse
 
దంపతులు సెక్స్‌కు సమాయత్తమైన సమయంలో ఘర్ణణలు, వైరుధ్యాలు చెలరేగి లైంగిక సంపర్కం తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడానికి అనువైన పద్ధతులను దంపతులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆమె లేదా అతను ఒక్కోసారి రఫ్‌గా వ్యవహరించినప్పుడు జీవిత భాగస్వామి సున్నితమైన శృంగారాన్ని ఆశించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి తనను నగ్నం చేయాలని ఆశించవచ్చు. ఆ కోరికను గ్రహించకుండా ముందుకు సాగితే అసంతృప్తి కలగవచ్చు. సెక్స్ చేసే పద్ధతిలో మార్పును కోరుకోవచ్చు. ఒక్కోసారి ఈ విభేదాలు భాగస్వామి పడక గదిని వదిలేసి వెళ్లిపోయే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి.

పురుషుడు తొందరగా తన పని ముగిస్తే స్త్రీ అసంతృప్తికి గురి కావచ్చు. దానివల్ల సెక్స్ తర్వాత ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మంచి మగవాళ్లు తన భార్య అసంతృప్తికి గురి కావడాన్ని ఇష్టపడరు. అటువంటి సందర్భాల్లో ఆమె మానానికి ఆమెను వదిలేయకుండా తనకు దగ్గరగా రావాలని చెప్పి, దగ్గరకు తీసుకుని నాలుకను, వేళ్లను ఉపయోగించి ఆమెను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే మంచిది. పురుషుడు పట్టించుకోకపోతే స్త్రీ తనకు ఏం కావాలో చెప్పి తాను తృప్తి పొందేలా చూసుకోవడం అవసరం.

లైంగిక సంపర్కరం జరిపే సమయంలో మీ జీవిత భాగస్వామి మనసును నొప్పించే మాటలు చెప్పకపోవడం మంచిది. దురవగాహన కలిగించే విధంగా మాట్లాడకూడదు. సరిగా అవగాహన కలిగించేలా మాట్లాడకపోవడం కూడా ప్రమాదంగా పరిణమిస్తుంది. కొంత మంది పురుషులు తమ భార్యలకు నిక్ నేమ్‌లు ఇస్తారు. సెక్స్ సమయంలో వాటిని అసందర్భంగా వాడితే వివాదం చెలరేగుతుంది. సెక్స్‌లో పాల్గొనే సమయంలో వాదాలకు దారి తీసే సంభాషణలు చేయకూడదు.

English summary
Sometimes one itsy bitsy thing can cause a conflict during sex and turn a passionate intercourse into a nightmare. Be careful and avoid a conflict during sex.
Story first published: Friday, March 25, 2011, 16:36 [IST]

Get Notifications from Telugu Indiansutras