•  

సెక్స్‌తో యవ్వనం సాధ్యమా?

Sex affects Health
 
సెక్స్ ద్వారా అందం, యవ్వనం సాధ్యమని స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్ ఎడిన్‌బర్గ్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధనకారులు తెలిపారు. ఎక్కవగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు. కనీసం తక్కువలో తక్కువగా వారానికి మూడు సార్లుసెక్స్‌లో పాల్గొంటే మనిషి వయసుకన్నాకూడా చాలా చిన్నవాడిగా కనిపిస్తాడని వారి పరిశోధనలో తేలింది. సెక్స్ చేయడం వ్యాయామం చేసినదాంతో సమానం, ఎందుకంటే రతిక్రియ జరిగే సమయంలో శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం చేసిన ఫలితం ఉంటుందని పరిశోధనకారులు తెలిపారు. ఇది శరీరంలోని చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుందని వారు వివరించారు.

పరిశోధకులు చెప్పిన విషయాల ప్రకారం - ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం, ముద్దులాడుకోవడం, ఏకాగ్రతతో సెక్స్‌లో పాలు పంచుకోవాలి. భార్యలతోనే రతిక్రియలో పాల్గొనాలనికూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే పరిచయం లేని వారితో రతిక్రియ జరిపితే వారికున్న అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందనివారు హెచ్చరిస్తున్నారు. పరస్త్రీలతో మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో శరీరం వయసు మీరినట్లుగా మారిపోతుందని, కాబట్టి కేవలం తమ సతీమణితో చేసే రతిక్రియవలన లాభాలను పొందగలరని పరిశోధకులు చెబుతున్నారు.

English summary
A survey revealed that Sex will protect the health of a person. It is said that sex 2 to 3 days in a week will good for health and it gives charming to the body.
Story first published: Saturday, March 19, 2011, 16:25 [IST]

Get Notifications from Telugu Indiansutras