సెక్స్ జీవితంపై అవగాహన, భార్యాభర్తల మధ్య పూర్తి సాంగత్యం కలగలిసిన మధ్య వయసు సెక్స్ జీవితానికి అంతే విలువ ఉంది. ఎటొచ్చీ వ్యక్తుల ఆలోచనా ధోరణిలో మార్పు కలిగితే మధ్య వయస్సులోనూ తమ శృంగార జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. మధ్య వయస్సులో స్త్రీ పురుషుల్లో సహజంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వాటిలో ముఖ్యంగా స్త్రీలలో సంబవించే మోనోపాజ్ దశ. నెలసరి వచ్చే ఋతుక్రమం ఆగిపోవడంతో వారిలో యోని పొడిబారడం, స్రావాలు తగ్గిపోవడం, లైంగిక వాంఛలు తగ్గడం, బరువు పెరగడం, భావోద్వేగాల్లో మార్పు లాంటివి కలిగే అవకాశముంది.
అలాగే పురుషుల్లో సైతం మధ్య వయస్సు వచ్చే సరికి వాంఛలు తగ్గడం, అంగం పటుత్వం తగ్గడం, శారీరక దారుడ్యం తగ్గడం, భావోద్వేగాల్లో మార్పు రావడం లాంటి సమస్యలు దరిచేరే అవకాశముంది. ఈ మార్పులు వారి సెక్స్ జీవితంపైన కూడా ప్రభావం చూపడంతో తామింక సెక్స్‌కు పనికిరామనే భావన వారిలో నాటుకుపోతుంది. అయితే, ఆ భావనలు సరి కావని అంటున్నారు. మధ్య వయస్సు వచ్చిన సమయంలో ఆడవారు సెక్స్ జీవితం పట్ల విరక్తి ప్రదర్శించడం ప్రారంభిస్తే వారి భర్తలు తప్పుదోవలు పట్టే అవకాశముంది. అలాగే శృంగారం లేదన్న పేరుతో భర్త దూరమైతే సదరు మహిళల్లో అభద్రతాభావం చోటు చేసుకునే ప్రమాదముంది. కాబట్టి వయస్సు రీత్యా ఏర్పడిన సమస్యలకు తగిన వైద్య సలహాలు తీసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రారంభిస్తే మధ్య వయస్సులోనూ చక్కని శృంగార జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చునని చెబుతున్నారు.