కాస్తా వాస్తవదృష్టితో చూస్తే ముద్దు అనేది తల్లికి, బిడ్డకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలు ప్రత్యేకంగా లేని కాలాల్లో తల్లులు తిండి పదార్థాలను తాము నమిలి దాన్ని బిడ్డలకు తినిపించేవారట. ఇది భావోద్వేగ పూరితమైన, శాంతి భద్రతలకు సంబంధించిన సంబంధంగా ఏర్పడింది. పిల్లలు ఇప్పటికీ తల్లులు వక్షోజాల ద్వారా పాలు తాగుతూ తాగుతూ అలాగే నిద్రపోవడం చూస్తాం. అదే ముద్దుకున్న ప్రత్యేకత అంటున్నారు.
ముద్దంటే చేదా అని ఓ అమ్మడు అడుగుతుంటే గుండె చెదిరిపోని పురుషులు ఉండరు. ముద్దుకు కూడా ఓ చరిత్ర ఉందంటున్నారు. అది ఎలా పుట్టిందనడానికి కూడా కథలున్నాయి. మధ్య యుగాల్లో చక్రవర్తులు తాము విధుల్లో ఉన్నప్పుడు తమ భార్యలు మద్యం ఏమైనా సేవించారా అని పరీక్షించడానికి ముద్దును కనిపెట్టినట్లు ఓ ప్రాచీన కథ ప్రచారంలో ఉంది. మరో కథ కూడా ఉంది. యువతులు ముద్దుల వల్లనే పిల్లలు పుడుతారని నమ్మేవారట. దీంతో ముద్దును ఒక అందమైన అందరాని విషయంగా మార్చేశారట.