•  

స్త్రీలు ఆఫ్టర్ ప్లే ఇష్టపడ్తారా?

Couple should equal partners in Sex
 
దంపతులిద్దరు అరమరికలు లేకుండా పాల్గొంటేనే శృంగార జీవితం సుఖాన్నిస్తుంది. భాగస్వామి ఆనందం గురించి పట్టించుకోకుండా కేవలం తమ ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తే శృంగార జీవితం సాఫీగా సాగదు. తన ఆనందంతో సంబంధం లేకుండా భర్త సెక్స్‌లో పాల్గొంటాడని, కేవలం అతని ఆనందం మాత్రమే చూచుకుంటాడని మహిళలు చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. తన భర్త ఎలాంటి రొమాన్స్ లేకుండానే నేరుగా సెక్స్‌కు ఉపక్రమిస్తాడని, సెక్సు పరంగా తన ఆనందం గురించి ఎంతమాత్రం ఆలోచించడని చెబుతుంటారు.

భర్తలు ఇలా ప్రవర్తించడం వల్ల వారి భార్యలకు కొంతకాలానికి సెక్స్ అంటేనే విరక్తి కల్గుతుంది. దానితో ఛీ ఎందుకు ఈ సెక్స్ జీవితం అనే స్థాయికి వారు చేరుకుంటారు. ఇలా జరిగితే వారి దాంపత్య జీవితం ఇక సాఫీగా సాగే ఛాన్సే ఉండదు. అందుకే దంపతులిద్దరూ సెక్స్ జీవితంలో తృప్తిని చవుచూడాలంటే ఏం చేయాలన్న విషయాన్ని సెక్సాలజిస్టులు ఈ విధంగా చెబుతున్నారు.

సెక్స్ విషయంలో మూడు దశలుంటాయి. ఫోర్‌ప్లే, ప్లే, ఆప్టర్‌ప్లే అనేవే ఆ మూడు దశలు. ఈ మూడు దశలను గురించి తెలుసుకుని ప్రవర్తించగల్గినపుడే దంపతుల శృంగారజీవితం ఆనందమయం అవుతుంది. మొదటిదశ అయిన ఫోర్‌ప్లేలో చక్కగా కబుర్లు చెప్పుకోవడం, ఆప్యాయంగాను, శృంగారపరంగాను దగ్గరకావడం, శృంగారం కోసం ఒకరినొకరు ప్రేరేపించుకోవడం చేయాలి. దీనివల్ల రెండవదశ అయిన ప్లేలో అంటే సెక్స్‌లో దంపతులిద్దరు మంచి ఊపుతో పాల్గొంటారు.

ప్లే ముగియగానే పురుషుడు అలాగే పక్కకి తిరిగి పడుకోకుండా ఆప్టర్‌ప్లేకు ఉపక్రమించాలి. స్త్రీని మరింత దగ్గరగా పొదవి పట్టుకోవడం, కౌగలించుకుని పడుకోవడం చేయాలి. ఎందుకంటే స్త్రీలు ప్లే కన్నా ఫోర్‌ప్లే, ఆప్టర్‌ప్లేకే ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ రెండింటిని సమర్థంగా అందించగలిగితే స్త్రీలు సెక్స్ విషయంలో ఎక్కువ ఆనందాన్ని పొందగల్గుతారు. దీనివల్ల పురుషునికి సైతం ఎక్కువ ఆనందం లభిస్తుంది.

English summary
Couple should play as equal partners in sex. Husband should not under estimate after play. Wife very much likes after play.
Story first published: Saturday, March 12, 2011, 16:05 [IST]

Get Notifications from Telugu Indiansutras