సాధారణంగా కొత్తగా పెళ్లయిన యువతులు చాలా మంది సెక్స్ అంటే భయపడుతారు. మరికొంతమంది అసహ్యించుకుంటారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలకు విముఖత చూపిస్తుంటారు. సెక్స్‌కు ఒత్తిడి తెస్తే విడాకులు కావాలని డిమాండ్ చేస్తారు. ఇందుకు కారణాలున్నాయి. ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి... ఇలాంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడిపడి ఉంటుంది. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు.
సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు. కనీసం జీవితభాగస్వామితో కూడా చర్చించలేరు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి వాటి వల్ల ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది.
దానికితోడు, జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితులు, ఒకరి పట్ల ఒకిరికి ఆకర్షణ ఉండకపోవడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది. వీటన్నింటికీ పరిష్కారాలు కనుక్కుంటే దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.