•  

సెక్సు ఏ సమయంలో...

Kamasutra-Srungaram
 
రతిక్రియలో పాల్గొనడానికి ఉత్సుకత చూపిస్తుంటే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎప్పుడు స్త్రీలతో రతిక్రియలో పాల్గొనాలనే విషయంపై జర్మనీకి చెందిన బైంబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనకారులు కొంతమంది మహిళలపై పరిశోధనలు చేశారు. మహిళల్లో ప్రతినెల జరిగే ఋతుక్రమం తర్వాత ఐదు నుంచి ఏడురోజుల వరకు వారిలో పురుషునితో సంగమించాలనే కోరిక బలీయంగా ఉంటుందని సెక్స్ స్పెషలిస్ట్‌లు తెలిపారు. వారిలో ఋతుక్రమం పూర్తయినవెంటనే రతిక్రియకు సంబంధించిన హర్మోన్లు విడుదలవుతాయని వారు వివరించారు.

మహిళలలో పీరియడ్లు ముగిసిన తర్వాత ఐదునుంచి ఏడురోజులలో వారి మస్తిష్కంలో రతిక్రియకు సంబంధించిన హర్మోన్లు విడుదలౌతాయని అప్పుడు వారు మంచి మూడ్‌లో ఉంటారని యువతులపై పరిశోధనలుగావించిన బృందం ప్రకటించింది. ఈ సమయంలో జరిగే రతిక్రియలో చాలా ఆనందం ఉంటుందని వారు వివరించారు. వారిలో ఈ మూడ్ దాదాపు 12 రోజుల వరకు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ప్రతి జంట తమ భాగస్వామితో రతిక్రియలో పాల్గొనాలనుకుంటే వారిమూడ్‌కు తగ్గట్టుగా పాల్గొనండి. ఇలాంటి సమయంలో మీరు మీ భాగస్వామితో రతిక్రియలో పాల్గొంటే వారితోబాటు మీరుకూడా స్వర్గసుఖాలను అనుభవిస్తారంటున్నారు పరిశోధకులు.

ఇలాంటి సమయంలో మీకు పూర్తిగా సహకరిస్తారనికూడా వారు పేర్కొన్నారు. నెలసరి జరిగిన తర్వాత మహిళల్లో రతిక్రియలో పాల్గొనాలనే కోరిక బలీయంగా ఉంటుందని, గర్భం దాల్చడానికి ఇదే సరైన సమయం కాబట్టి వారిలో ఈ కోరిక విపరీతంగా ఉంటుందని వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన సైకియాట్రిక్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ అనితా క్లెటన్ వివరించారు.

English summary
Which time is better for sex.....
Story first published: Sunday, February 20, 2011, 16:14 [IST]

Get Notifications from Telugu Indiansutras