ఇద్దరు కలిసి చేయాల్సిన పనుల జాబితా ఒక్కటి రూపొందించుకోవాలి. రెండు, మూడు రోజుల పాటు పనులకు సెలవు పెట్టి ఎక్కడైనా తిరగడానికి వెళ్తే మంచిది. భవిష్యత్తు కోసం ప్రణాళికలను వెంటనే పూర్తి చేయడం మొదలు పెట్టాలి. మీ భాగస్వామికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పించవచ్చు. మీ భాగస్వామి ధరించే దుస్తుల పట్ల ఇష్టాన్ని ప్రదర్శించవచ్చు. శారీరకంగా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేయండి. దుస్తులు ధరించడం మీ భాగస్వామికి ఇష్టమయ్యేలా ఉండాలి. వెంటనే ఇది ఫలితం చూపకపోయినా దీర్ఘకాలంలో ఫలితం ఇస్తుంది.
ఏళ్ల తరబడి సంసారం సాగించిన తర్వాత కూడా దంపతుల ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా సజీవంగానే ఉందా అనే ప్రశ్న రావడం అసహజమేమీ కాదు. దంపతులు పరస్పరం ప్రేమను, రోమాన్స్‌ను ఓ అలవాటుగా కాకుండా సజీవంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమను కాపాడుకోవాలని చైతన్యపూరితమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామి పట్ల మిమ్మల్ని ఆకర్షితులను చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఇష్టమైన రెస్టారెంట్లకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా రోమాన్స్‌ను సజీవంగా ఉంచుకోవచ్చు.