•  

సెక్స్‌లో కామశాస్త్ర ప్రాధాన్యం

kamasutras in Sex
 
సెక్స్ అనేది దంపతుల మధ్య సంబంధాలను నిర్ధారిస్తుంది. ఈ సంబంధాన్ని బట్టే మానవ జీవితం రూపుదిద్దుకుంటుంది. ఆహారం, నిద్ర సమస్త ప్రాణులకు సహజమైనట్లే, మానవ జీవితంలో అతి ప్రధానమైన సెక్స్ కూడా సహజమైనదే. అటువంటి ఈ సుఖాన్ని ఎంతమాత్రం నిరాదరణకు గురిచేయడానికి వీలు లేదు. అయితే, ఆత్మ నిగ్రహం, ఆత్మ విచారం ఈ రెండూ వుండి కామ సుఖం అనుభవించినప్పుడే దానికి సార్థకత.

ప్రాచీన భారతీయులు కామశాస్త్రాన్ని గురించి నిష్పక్షపాతంగా చర్చించి, దీనిని కూడా ఒక కళగా ఆరాధించారు. లైంగిక సంబంధమైన ఎన్నో రహస్యాలను తెలుసుకున్నారు. దీనిని ప్రకృతి ధర్మంగా భావించి ఆచరించారు. అంతేతప్ప ఇది ఒక అశ్లీలతగా, ఒక అసభ్యకరమైన విషయంగా వారు పరిగణించలేదు. సెక్స్‌తో జీవితం మరింత సుఖమయంగా, ఆనందమయంగా ఉంటుందని స్పష్టం చేశారు.

రెండుగా చీలిన విత్తనం నుంచి చెట్టు ఎలా మొలకెత్తదో అలాగే కేవలం పురుషుడి వల్ల లేదా కేవలం స్త్రీ వల్ల సృష్టి జరుగదు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతడు మరో దానికోసం ఆరాటపడ్డాడు. తన దేహాన్నే రెండు భాగాలు చేశాడు. ఆ రెండింటికే మిథునమని పేరు. వారే దంపతులు. వారి మైథున క్రియ మూలంగా సృష్టి ఆరంభమైంది. ఈ మైథున క్రియ ఎలా ఆచరించాలని చెప్పేందుకే కామ శాస్త్రం ఆవిర్భవించింది. కాలం మారినా, మనుషులు మారినా, ఆచారాది వ్యవహారాలు మారిపోయినా ఈ కాలంలో కూడా ఆచరించదగినవి కామ సూత్రాలు. స్త్రీ, పురుష లైంగిక సంబంధమైన విషయాలను పూర్వం గోష్టులుగా చెప్పుకునేవారట. కామశాస్త్రం చక్కగా అవగతం చేసుకుని ఆచరించేవారికి అది శృంగార రస సాగరంలో ఓలలాడిస్తూ జీవితాన్ని సుఖమయం చేస్తుంది.

English summary
Indian culture gave utmost importance to sex. They felt it is an important activity in human life. It is necessary to follow Kamasutra to get satisfaction in sex and male life fruitful.
Story first published: Thursday, February 24, 2011, 17:09 [IST]

Get Notifications from Telugu Indiansutras