మద్యం సేవించే లేదా పొగతాగే వృద్ధుల్లో నోరు లేదా ఓరోఫారింక్స్ క్యాన్సర్లు బయటపడుతాయి. ఇది గొంత పైభాగాన సోకే క్యాన్సర్. అయితే ఇటీవలి కాలంలో వయస్సు తక్కువ గలవారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తోంది. ఓరల్ సెక్స్ వల్ల సోకే హెచ్‌పివి పొగాకు వల్ల సోకే వైరస్ కన్నా దారుణమైందని కొలంబస్‌కు చెందిన ఓహ్యో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మౌరా గిల్లిసన్ అంటున్నారు. ఎంత మందితో ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నారనే దానిపై కూడా ఈ వ్యాధి తీవ్రత ఉంటుందని చెప్పారు.
ఓరల్ సెక్స్ వల్ల ప్రమాదం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓరల్ సెక్స్ వల్ల వైరస్ వ్యాప్తి చెంది గొంతు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారంటున్నారు. ఈ ప్రమాదం 50 లోపు వయస్సు గలవారిలో చోటు చేసుకోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. సురక్షితం కాని శృంగారం నెరిపినప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ విజృంభిస్తుందని, గత కొన్ని దశాబ్దాలుగా ఇది గొంతు క్యాన్సర్‌కు కారణమవుతోందని అంటున్నారు.