•  

సెక్స్‌కు సూర్యరశ్మికి లింక్ ఉందా?

Kamasutra-Srungaram
 
సూర్యరశ్మికి, సెక్స్ పటుత్వానికి మధ్య సంబంధం ఉందంటున్నారు సెక్సాలిజిస్టులు. సెక్స్ సమస్య నగర, పట్టణవాసులలోనే అధికంగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. కారణం - నగరాలు, పట్టణాలలో నివశించే ప్రజలు, ముఖ్యంగా పురుషులు తమతమ పనులతో మహా బిజీగా ఉంటారు. తెల్లారింది మొదలు రాత్రయ్యేవరకూ సూరీడు కిరణాలు తగలని ఆఫీసు కార్యాలయాల్లోనే కాలం గడుపుతారు. రోజుకు కనీసం ఓ గంటపాటైనా శరీరంపై సూర్యరశ్మి సోకని పురుషులలో సెక్స్ సామర్థ్యం తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

పూర్వకాలంలో సెక్స్ సత్తా లోపించిందని తెలిసినపుడు కామోద్రేకాన్ని కలిగించడానికి అప్పటికప్పుడు రెడీమేడ్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివిగా ఉండే మూలికలు లభ్యమయ్యేవని పూర్వులు చెప్పేవారు. అంతేకాదు దీనికంటూ ఓ వ్యక్తి ప్రతి గ్రామంలోనూ లేహ్యాలతో కాపురముండేవాడు. అయితే, అది క్రమంగా కనుమరుగైంది. ఇక కామసూత్ర, రతీమన్మథుల మధ్య కామోద్దీపనకై వారు ఎటువంటి మార్గాలను అన్వేషించారో తెలుసుకునే సమయమూ తీరికా ఇప్పుడు లేదు.

సెక్స్ సామర్థ్యం పెరగాలంటే, రోజూ కనీసం గంటకు తగ్గకుండా సూర్యరశ్మికింద శరీరాన్నుంచాలి. అదేవిధంగా చాలినంత నిద్ర తప్పనిసరి. ఇంకా పరిశుద్ధమైన గాలి వీచే ప్రదేశాన్ని చూసుకుని అక్కడ కనీసం ఓ అరగంటపాటు గడిపాలి. వ్యాయామం తప్పనసరి. ఇవన్నీ చేస్తే శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది.

English summary
It is aiad that there is a link between sun light and sexual power. it is tevealed that sexual power is decreasing in men in urban areas as they work under closed doors in offices.
Story first published: Wednesday, February 23, 2011, 16:44 [IST]

Get Notifications from Telugu Indiansutras