ఇక యవ్వనంలోకి ప్రవేశించిన యువతీయువకులు తుళ్లిపడుతుంటారు. ఈ వయసులో వారిమధ్య సహజంగా పరస్పర ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత పెళ్లితో ఒకటైన యువతీయువకులు మధ్యవయసు వచ్చేసరికి నిట్టూర్పులు వదులుతుంటారు. సెక్స్ జీవితానికి హృదయం ఎంత ముఖ్యమో మెదడు కూడా అంతే ప్రధానం.
పెళ్లికి ముందు ఎంతో శ్రద్ధగా అలంకరణ చేసుకునే అమ్మాయిలు పెళ్లై, పిల్లలు కలిగిన తర్వాత తమ అందం మీద అస్సలు శ్రద్ధే చూపరు. ఈ తేడా ఎందుకనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే అది మెదడు చూపే సహజమైన స్పందన. చక్కని చీరకట్టుకుని పడకగదికి చేరిన భార్య, తన డ్రెస్‌ని ఒక్కొక్కటే తొలగిస్తూ భర్త చేసే శృంగారం, సెక్స్‌ని ఎంతో ఆనందిస్తుంది. ఆ తొలిరోజు అతిమధురంగా గడిచిపోతుంది.
ఆ తర్వాత తొలినెల మధురంగా ఉంటుంది. ఆ తర్వాత అది క్రమంగా మామూలైన ఓ ప్రక్రియగా మిగులుతుంది. ఒక అనుభవం నాలుగైదుసార్లు కలిగిన తర్వాత ఇక అందులో మెదడుకు కొత్తదనం కనిపించదు. అందుకే వాత్సాయనుడు లైంగిక జీవితంలో ప్రయోగాలు అవసరమన్నాడు. ఒకే భంగిమలో సెక్స్ ముగించే వారికి అది యాంత్రిక సెక్స్‌గా తయారవుతుంది. కొత్త కొత్త భంగిమలలో పడక గదికి ఆవల, కొత్త ఊళ్లలో అలా సెక్సీ వేదికలను మార్చుకుంటుంటే ఆ కొత్త అనుభవాలను మెదడు మరింతగా ఆస్వాదిస్తుంది.