సెక్స్, ఆల్కహాల్ విన్నింగ్ కాంబినేషనా?

Alcohol and Sex
 
ఆల్కహాల్ తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. సెక్స్‌, ఆల్కహాల్ కూడా మనుషులను మత్తులో ముంచేవే. మత్తులో ముంచే ఈ రెండు పదార్థాలకు పొత్తు కుదురుతుందా అనేది ప్రశ్న. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుందట. ఎక్కువ మోతాదు ఆల్కహాల్ వల్ల అంగస్తంభన సమస్య తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. పరిమిత మోతాదులో మద్యం తీసుకుంటే సెక్స్ పటిమ పెరుగుతుందని, చాలా రిలాక్స్‌కా కనిపిస్తారని, విశ్వాస పెరుగుతుందని, ఆకర్షణీయంగా కనిపిస్తారని అంటున్నారు. దీనివల్ల పురుషులు, స్త్రీలు తమ భాగస్వాములను గెలుచుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు.

అయితే, రోజూ ఆల్కహాల్ తీసుకోవడమనేది ప్రోత్సహించదగిన విషయం కాదు. కానీ, ఒకటో, రెండో గ్లాసులు ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్ వల్ల సరిహద్దులు చెరిగిపోతాయని అంటున్నారు. అయితే, ఆల్కహాల్ వినియోగం అనేది ఒక అలవాటుగా మారకూడదు.

Story first published: Thursday, February 3, 2011, 16:23 [IST]
Please Wait while comments are loading...