మహిళల్లో తమ లైంగిక అవసరాల పట్ల విశ్వాసంతో వ్యవహరిస్తుండడం పురుషులను మానసికంగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. పైగా, ఇంటర్నెట్, కేబుల్ టీవీ, మ్యాగజైన్లలో శృంగారపరమైన చిత్రాలు ఎక్కువగా చూసే అవకాశం దొరుకుతుండడంతో పురుషులు వాస్తవానికి కాకుండా ఫాంటసీకి అలవాటు పడుతున్నారని అధ్యయనంలో తేలింది.
తనకు తలనొప్పిగా ఉందంటూ సెక్స్ పట్ల స్త్రీలు ఆనాసక్తి ప్రదర్శించడం తరుచుగా జరుగుతుంది. కానీ పురుషుల్లోనూ సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. పదేళ్ల క్తిరం పరిస్థితితో పోలిస్తే పురుషుల్లో సెక్స్ పట్ల 40 శాతం మందికి అనాసక్తి పెరిగిందని రిలేషన్ - కౌన్సెలింగ్ సర్వీస్ రిలేట్ అధ్యయనంలో తేలింది. ఈ 40 శాతం మందిలోనూ ఏ విధమైన శారీరక సమస్యలు లేవట. తమకు సెక్స్ అవసరం లేదని చెప్పారట. సమాజంలో మహిళలు నిర్వహిస్తున్న పాత్ర మారడమే దీనికి కారణమని పరిశోధకులు అంటున్నారు.