పురుషుల్లో స్త్రీలు ఏం కోరుకుంటారనేది ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. దీనిపై పురుషులు ఎప్పటికప్పుడు తర్జనభర్జనలు పడుతూనే ఉంటారు. తమలో స్త్లీలకు ఏం నచ్చుతుందనేది పురుషులకు ఎప్పుడూ టెన్షన్‌గానే ఉంటుంది. స్త్రీలు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినాలి. దాని వల్ల తమను ఎదుటి మగవాడు పట్టించుకుంటున్నాడనే భావన స్త్లీలో కలుగుతుంది. పురుషులు స్మార్టుగా వ్యవహరించాలి. తమ చెడు పద్ధతులన్నీ అంటగట్టకూడదు. స్త్రీల పట్ల సెన్సిటివ్‌గా ప్రవర్తించాలి. దీనికి యువకులు ఇక్యూ అభివృద్ధి చేసుకోవాలి.
స్త్రీల విషయంలో కమ్యూనికేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకు తరుచుగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు జీవిత భాగస్వామి కోసం వంటలు కూడా చేయాలి. అది జీవిత భాగస్వామికి అద్భుతమైన ఆనందాన్నిస్తుంది. వాహనాలు రాష్‌గా డ్రైవ్ చేయకూడదు. కూల్‌గా డ్రైవ్ చేసే పురుషులు స్త్రీలకు నచ్చుతారు. రక్షణ ఇస్తున్నట్లు వ్యవహరించాలే తప్ప ఆధిపత్యం వహిస్తున్నట్లు వ్యవహరించకూడదు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.