సెక్సువల్ ఫిట్‌నెస్‌కు యోగాకు మధ్య సంబంధం ఉందని, సెక్స్ ‌కు సంబంధించిన సమస్యలను యోగానుంచి పరిష్కరించుకోవచ్చునని యోగా గురువులు అంటున్నారు. ఆరోగ్యంగావుంటూ సెక్స్ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చునని చెబుతున్నారు. యోగా అనేది ఆధ్యాత్మికంతో పాటు సెక్స్ జీవితానికికూడా మంచి ఔషధం లాంటిది. ఈ రెండింటి మధ్య సమతుల్యమైన ఫలితాలుంటాయంటున్నారు వారు. యోగా అంటేనే జోడించడం. కలపడం అని అర్థం. యోగా శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది.
శరీరంలో ఏదైనా లోపం కలిగి అశాంతిగావుంటే మనిషి ప్రగతిని సాధించలేడు. శరీరం ఎవరైనా సహకరిస్తే ఎలాంటి పనైనాకూడా తక్షణమే చేయగలరు. యోగా అనేది మీకు మీ భాగస్వామికి మంచి దివ్యౌషధంలాంటిది. శరీరంలో నూతనోత్సాహాన్ని నింపడానికి మరే ఇతర మందులు లేవు. దీనికి యోగాలో పద్మాసనమే ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు. పద్మాసనం ఏకాగ్రతను పెంచుతుందని చెబుతున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.