•  

సెక్స్‌ను సెక్స్‌గానే చూడాలి

Sex
 
సహజంగా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కోర్కెలు విజృంభిస్తాయి. ఆ కోర్కెల్లో ఎక్కువగా శృంగారానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. ప్రస్తుతం యువత దేనికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారని పరిశోధనలు చేసినప్పుడు తమ కామవాంఛ తీర్చుకోవడానికేనని వివిధ పరిశోధనల్లో తేలినట్లు నిపుణులు తెలిపారు. సెక్స్‌‌ను సక్రమమైన మార్గంలో అనుభవించనివారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు చెబుతున్నారు.

మానసికోల్లాసం కోసం శృంగారం దివ్యౌషధమని పరిశోధకులు పేర్కొంటున్నారు. శృంగారంలో మునిగితేలాలంటే మరొక వ్యక్తి అవసరం. సెక్స్‌లో పాల్గొనేందుకు గల కారణాలు సుమారు 237 వున్నా ముఖ్యంగా మూడు కారణాలనే ప్రధానంగా చెప్పుకుంటాం. మంచి సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి, తాము ప్రేమలో మునిగితేలుతున్నామని చెప్పడానికి, అసలు సెక్స్‌ అంటే తెలుసుకోవడానికి. అని చాలా మంది చెప్పినట్లు శాస్త్రజ్ఞులు జరిపిన సర్వేలో తేలింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు. ప్రేమ, ఆకర్షణ, పిల్లలు పుట్టాలనే కోరికతో తాము అధికంగా శృంగారంలో పాల్గొంటున్నామని మరి కొందరు చెబుతున్నారని తమ సర్వేలో తేలిందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధకులు డేవిడ్‌గే బృందం తెలిపింది.

అమెరికా మానసిక నిపుణులైన డేవిడ్‌గే బుష్‌, క్యాండీ మిస్టన్‌ సెక్స్‌‌లో పాల్గోనేందుకు గల కారణాలపై దాదాపు ఐదు సంవత్సరాలపాటు ఒక సర్వేను నిర్వహించారు. డేవిడ్‌గే సేకరించిన వివరాల ప్రకారం చాలామంది సెక్స్‌ ఎందుకు చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు.

సెక్స్‌లో పాల్గొనడానికి కారణాలు తెలిసినప్పటికీ వారు సరిగా చెప్పలేక పోయారన్నారు. కొందరు ప్రేమ కోసమంటే మరికొందరు తమ కోపాన్ని, తాపాన్ని తగ్గించుకునేందుకే తాము సెక్స్‌లో పాల్గొన్నామన్నారు. డ్రగ్స్‌‌కు అలవాటు పడ్డవారు అవసరానికి డ్రగ్స్ ఉపయోగించేందుకే తాము సెక్స్‌లో పాల్గొంటున్నట్లు కొందరు చెప్పారని డేవిడ్‌గే వివరించారు.

సెక్స్‌లో పాల్గొంటే అందులోనున్న తృప్తి మాటల్లో చెప్పలేమని, సెక్స్‌లో పాల్గొనడం ద్వారా శారీరక ఉత్తేజం కలుగుతుందని చాలా మంది చెప్పారని ఆయన తెలిపారు.

మరో పరిశోధకుడు క్యాండీ మిస్టన్‌ తెలిపిన వివరాల మేరకు సెక్స్‌ కోసం తాము చంద్రమండలానికైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు తెలిపారన్నారు. స్త్రీలు మాత్రం కేవలం తమ భాగస్వామిని సంతృప్తిపరచడానికే సెక్స్‌లో పాల్గొంటున్నామని చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో పురుషులు సెక్స్‌పై వ్యక్తం చేసిన వివరాలు ఈ విధంగా వున్నాయని వారు వివరించారు.

Story first published: Saturday, January 29, 2011, 17:36 [IST]

Get Notifications from Telugu Indiansutras