తాము రతిప్రక్రియలో, సెక్స్‌కు సంబంధించి ప్రేరేపణల పట్ల 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. సెక్స్‌కు తమ ప్రేరేపించిన విషయాలను వారు విభిన్నంగా చెప్పారు. సామాజిక హోదా, అభివ్యక్తి, ప్రతీకారం, ఒత్తిడి తగ్గించుకోవడం, కేలరీలను కోల్పోవడం వంటి పలు కారణాలు తమను సెక్స్‌కు పురికొల్పినట్లు వారు చెప్పారు. అయితే, వీటన్నిటిలోకి సెక్స్‌ చేయడానికి ప్రేమ పురికొల్పినప్పుడు ఎక్కువ తృప్తి పొందినట్లు అత్యధికులు చెప్పారు.
సెక్స్‌లో తృప్తిని ఆశించేవారు కొద్దిసేపు ఆగి ఆలోచించి సెక్స్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నామో తెలుసుకోవాలని ఇటీవల జరిగిన ఓ సర్వే అంటోంది. భౌతికమైన లాభాపేక్షతోనో, విజయం సాధించాలనే ఉద్దేశంతోనో పాల్గొనే సెక్స్‌లో కన్నా ప్రేమపూరితమైన కాంక్షతో సెక్స్‌లో పాల్గొంటేనే సౌఖ్యం, తృప్తి లభిస్తాయని అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. లైంగికంగా యాక్టివ్‌గా న్న 544 మంది అండర్ గ్రాడ్యుయేట్ పురుషులను, స్త్రీలను అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే, పురుషుల్లో, స్త్రీలల్లో సెక్స్‌లో సంతృప్తికి సంబంధించి తేడాలున్నాయి.