అంగస్తంభన జరిగి, స్ఖలనం జరిగినా కూడా సెక్స్‌లో పూర్తి తృప్తి లభించడం లేదని తమ గ్రూపులోని 16 శాతం మంది చెప్పినట్లు వీల్ కోమెల్ మెడికల్ కాలేజీ యూరోలజీ, రిప్రొడక్టివ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డేరియస్ పదూచ్ చెప్పారు. తమ అధ్యయనం ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని ఆయన అన్నారు. వయసు పైబడినవారిలోనే కాకుండా 20 ఏళ్ల వయస్సులో ఉన్న యువకుల్లో కూడా ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. లైంగిక సమస్యలను ఎదుర్కునే స్తీ పట్ల సమాజంలో ఉండే సానుభూతి పురుషుల పట్ల ఉండదని, కొజ్జా అని, పురుషత్వం లేదని మగవాళ్లను అవహేళన చేయడం పరిపాటి అని ఆయన అన్నారు.
శృంగారంలో తృప్తి పొందిన విషయంపై చాలా మంది పురుషులు అబద్ధాలు చెబుతున్నట్లు ఇటీవలి అధ్యయనంలో తేలింది. సెక్స్ క్లైమాక్స్‌కు చేరుకున్నా తాము తృప్తి పొందడం లేదని 16 శాతం మంది పురుషులు చెప్పినట్లు పరిశోధకులు తెలిపారు. సమస్య అంగస్తంభన వల్లనో, స్ఖలనం కాకపోవడం వల్లనో కాదని, అంతా సజావుగానే జరిగినా తగిన తృప్తి పొందడం లేదని పురుషులు చెప్పినట్లు న్యూయార్క్ డైలీ న్యూస్ రాసింది.