మెనోపాజ్ దశలో సెక్స్ కోరికలు స్త్రీకి, స్త్రీకి మధ్య భిన్నంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సెక్స్ సంబంధమైన కోరిక ఉంటుందట. బంధువు పట్ల శ్రద్ధ తీసుకోవడం, భాగస్వాముల మధ్య లైంగిక కోరిక సన్నగిల్లడం, సంబంధ ప్రమాణాల వంటివే హార్మోన్లపరమైన మార్పుల కన్నా ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాయని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది.
లైంగిక కార్యకలాపాల్లో మునిగితేలే సామర్థ్యం మీద మహిళల్లో హార్మోన్ల విడుదల తగ్గడం ఆధారపడి ఉంటుందని తేలింది. ఈ సమయంలో లైంగిక కోరిక పెరగడం తాము గమనించామని విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ శరోన్ హించ్‌క్లిఫ్ అన్నారు. మధ్య వయస్సులో మహిళలు వివిధ జీవనశైలులను దాటుతారని, ఆ అంశాలన్నీ లైంగిక కోరిక మీద ప్రభావం చూపుతాయని ఆ పరిశోధన తేల్చింది.