•  

రెగ్యులర్ సెక్సుతో దీర్ఘాయువు

Kamasutra
 
రెగ్యులర్‌గా సెక్సులో పాల్గొంటే దీర్ఘాయువుకు ఆస్కారం ఉంటుందని సెక్సు వైద్యులు చెబుతున్నారు. పురాణకాలంలోనే వాత్సాయనుడు తన వాత్సాయన కామసూత్రలో చెప్పాడని అంటున్నారు. పడకగదిలో సెక్స్ సుఖాన్ని అనుభవించిన జంటల్లో శరీరాన్ని పటిష్టపరిచే హార్మోన్ల విడుదల ఉంటుందంటున్నారు. ఈ హార్మోన్ల వల్ల శరీరానికి కొత్త శక్తి వచ్చి చేరుతుంది. పెద్దలలో దాదాపు అన్ని అనారోగ్యాలను అదుపులో పెట్టగల శక్తి సెక్స్‌కు ఉంది. కనీసం వారంలో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొనేవారిలో అనారోగ్య సమస్యలు చాలా అరుదుగా తలెత్తుతాయంటున్నారు.

సెక్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొనేవారిలో క్యాలరీల ఖర్చు అధికమవుతుంది. ఫలితంగా అధిక బరువు, ఇతర సమస్యలు తలెత్తవు. అదేవిధంగా జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది. ఒత్తిడి, చికాకులన్నీ దూరమై ప్రశాంతమైన జీవనాన్ని అందిస్తుంది. తలనొప్పి, పార్శ్వనొప్పి వంటివాటికి సెక్స్ ఔషధంగా పనిచేస్తుందంటున్నారు. సెక్స్‌లో భావప్రాప్తి దశకు చేరుకునే ముందు ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి ఐదు రెట్లు పెరుగుతుంది. దీంతో ఎండార్ఫిన్లు విడుదలై తలనొప్పి, ఇంకా ఇతర నొప్పులను పారదోలతాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే జంటల్లో రోగనిరోధక శక్తి అధికమవుతుంది.

Story first published: Sunday, January 9, 2011, 15:56 [IST]

Get Notifications from Telugu Indiansutras