•  

సెక్స్ ఆస్వాదనకు కామసూత్ర వినండి

Listen to Kamasutra
 
సెక్స్ ‌ను ఉత్తమంగా ఆస్వాదించడానికి ఓ మంచి మార్గం దొరికింది. అతి ప్రాచీనమైన వాత్సాయనుడి కామసూత్ర ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది. అందులోని సలహాలు ఇప్పటికీ ఆచరణీయమే. ఆధునిక జీవితంలో కూడా సెక్స్ ను ఉత్తమ రీతిలో అనుభవించి, ఆస్వాదించడానికి తగిన సూచనలు అందులో ఉన్నాయి. ఈ స్థితిలో దాన్ని ఆడియో రూపంలో వినే అవకాశం స్త్రీపురుషులకు దక్కింది. ఆడియో పుస్తకం రూపంలో అది విడులైంది.

కామసూత్రను యాక్టర్ తాన్యా ఫ్రాంక్స్ చదవగా లండన్ కు బ్యూటిఫుల్ బుక్స్ రికార్డు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. స్త్రీపురుషుల లైంగిక ఐక్యత అనే అధ్యాయం కూడా ఆడియోలో రికార్డు అయింది. ఇందులో సెక్స్ క్రీడకు సంబంధించిన 64 పద్ధతుల వర్ణన ఉంది. ఈ పుస్తకాలను 8.99 డాలర్లకు నెట్ నుంచి డవున్ లోడ్ చేసుకోవచ్చు. రిచజర్ బర్టన్ నేతృత్వంలో కామసూత్ర 1883లో ఆంగ్లంలోకి అనువాదమైంది. నలుగురి ముందు ఆ పుస్తకం చదవడానికి ఇబ్బందిగా ఉండేవారు, ఎవరికీ తెలియకుండా డవున్ లోడ్ చేసుకుని వినవచ్చునని బ్యూటిఫుల్ బుక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సైమన్ పెథరిక్ అంటున్నారు.

Story first published: Monday, January 3, 2011, 16:44 [IST]

Get Notifications from Telugu Indiansutras