అయితే సమాజం అన్నాక అన్ని వయసులవారూ ఉంటారు. భిన్న మనస్తత్వం కలవారూ ఉంటారు. టీనేజర్స్ అలాంటి చిత్రాలు చూస్తే నిగ్రహం కోల్పోయి ఎవరికో ఒకరికి లొంగిపోయి జీవితం పాడుచేసుకోవచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. కాబట్టి అటువంటి ప్రమాదాలను నివారించేందుకు వీటి ప్రదర్శనపై నిషేధాలు వచ్చాయి. అయితే నాలుగు గోడల మధ్య, ఇతరులకు తెలియని పరిస్థితుల్లో ఎలాంటి చిత్రాలు చూసినా, ఏం చేసినా దంపతుల విషయంలో తప్పుకాదు. దానిని మానసిక రోగంగా చూడకూడదంటున్నారు.
వయసుతోపాటు మనసులో కొన్ని కోర్కెలు రేగుతాయి. అటువంటి వాటిలో నీలి చిత్రాలు చూడాలనుకోవడం కూడా ఒకటి. అంతేకానీ ఇది మానసిక రోగం అనుకోవడానికి వీలులేదంటున్నారు. అయితే ఈ చిత్రాల ప్రభావం అందరి మీదా ఒకలా ఉండదు. భార్యాభర్తలైతే అటువంటి చిత్రాలు చూసినప్పుడు వెంటనే కోర్కెను తీర్చుకోగలుగుతారు. కానీ, వాటికి అలవాటు పడిపోతే మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.