•  

సెక్స్ సీన్లు చూడడం తప్పా?

Is it good to see Sex scenes
 
అశ్లీల దృశ్యాలు, సెక్స్ సీన్లు, సెక్స్ బొమ్మలు చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాదు ఏ కాస్త టైం దొరికినా సెక్స్‌కు సంబంధించిన కబుర్లు తప్ప మరేవీ రావడం లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సెక్స్ దృశ్యాలను చూసిన సదరు పురుషులు తమ ప్రియురాళ్లు, భార్యలు కూడా బ్లూ ఫిల్మ్‌లో సెక్స్ యువతుల్లా ప్రవర్తించాలనీ, ఆ భంగిమలే కావాలని మారాం చేయడమూ పెరిగిపోతున్నది.మగవారి ఈ వింత ప్రవర్తనుకు విసిగిపోయిన మహిళలు తమ మనసులో గూడుకట్టుని ఉండే లైంగిక ఆలోచనలను భాగస్వామితో పంచుకోవడం లేదని తేలింది. అలాగాని సెక్స్ సీన్లు చూసే పురుషులందరూ అచ్చు అలాంటి రతినే ఇష్టపడతారనుకోవడమూ పొరపాటే. అంతేకాదు అశ్లీల చిత్రాలు, సెక్స్ బొమ్మలను చూసేవారిలో వివాహమైనవారే అధికులు ఉంటున్నారు.

ఇక సెక్స్ సంబంధాలు గురించి తమ తమ సెల్ ఫోన్లలో ఎస్ఎమ్ఎస్‌లు చేసే స్త్రీపురుషులూ నేటి సమాజంలో అధికమవుతున్నట్లు వెల్లడైంది. అన్నిటికీ మించి ఇష్టమైన వ్యక్తితో సెక్స్ సంబంధం.. పెళ్లికాక ముందే రతి అనుభవం అనేది తప్పు కాదనే భావన ఇపుడు చాలామందిలో పేరుకుపోయింది. పైపెచ్చు నచ్చిన వ్యక్తితో సెక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిసి చూడటం తప్పు కానేకాదని వాదిస్తున్నవారి సంఖ్యా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో మనసులు కలిసిన అమ్మాయి - అబ్బాయి కలిసి సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది. అది ఓ అలవాటుగా మారిపోయిందని చెప్పవచ్చు.

Story first published: Saturday, January 22, 2011, 16:34 [IST]

Get Notifications from Telugu Indiansutras