సెక్స్ సమయంలో స్త్రీపురుషుల్లో కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని, ఇవి పెయిన్ కిల్లర్ల మాదిరిగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. గినా ఆగ్డెన్ అధ్యయనంలో ఈ విషయం తేలింది. స్త్రీలలో ఫెర్టిలిటీ పెరిగి, మెనోపాజ్ దశ వాయిదా పడుతుంది. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధులను సెక్స్ కాపాడుతుందని చెబుతున్నారు. సెక్స్ మానేయడం వల్ల ద్రవం నిలిచిపోయి ప్రొస్టేట్ గ్రంధులు లావు అవుతాయని, సెక్స్ వల్ల అది వెళ్లిపోయి ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. అంగ స్తంభన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని అంటున్నారు.
ప్రతి రోజూ సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. శరీరం, మెదడు ఎన్నో వ్యాధులకు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకు నాలుగు కారణాలు చెప్పవచ్చు. శృంగారం అనేది వ్యాయామం లాంటిదనే విషయం అందరికీ తెలిసిందే. శ్వాస రేటు పెరుగుతుంది. అంటే ఎంతో శ్రమ పడినట్లు. వారానికి మూడు సార్లు 15 నిమిషాలు సెక్స్ చేస్తే ఏడాదికి 7.500 కాలరీల శక్తి పోతుంది. ఇది 75 మైళ్లు జాగింగ్ చేసినంత ప్రయోజనం నెరవేరుస్తుందని. సెక్స్ సమయంలో శ్వాస తీసుకోవడం పెరుగుతుంది. దానివల్ల శరీరంలోని కణాలకు విరివిగా ఆక్సిజన్ అందుతుంది.