•  

కొవ్వు పెరిగితే సెక్స్ పవర్ తగ్గుతుందా

Sex Power
 
కొవ్వులు, కొలెస్టెరాల్ స్థాయి తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల రక్తనాళాలు మూసుకుపోవడం, రక్త నాళాలు దళసరి కావడం తగ్గుతుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అయితే కొలెస్టెరాల్ అనేది పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పురుషునిలో ఆ హార్మోన్ సెక్స్ కోరికలు, సెక్స్ సామర్థ్యానికి మూలం. ఇక సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనేది ఆధారంలేని ఓ విశ్వాసం. అలాగే పురుషాంగాలను పోలి వుండే పదార్థాలు సెక్స్ శక్తిని పెంచుతాయనే నమ్మకం చాలాకాలంగా ఉంది. అయితే సెక్స్ కోర్కెలను ప్రత్యక్షంగా పెంచగలగిన ఆహారపదార్థాలు లేనేలేవంటారు సెక్స్ నిపుణులు.

అయితే సెక్స్ లో అంగం స్తంభన సమస్యతో బాధపడేవారు సిల్డినాఫిల్సిట్రేట్ వయగ్రా, ఇండియన్ వయగ్రా వంటి టాబ్లెట్లను వాడవచ్చు. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. వీటిని వాడటం వల్ల అంగం స్తంభిస్తుంది. అయితే ఈ టాబ్లెట్లను వాడదలుచుకున్నవారు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి టాబ్లెట్లను వాడాలి. మరో విషయమేమంటే, సెక్స్ లో పాల్గొనే ముందు ఖాలీ కడుపుతో ఈ టాబ్లెట్ వేసుకోవాలి. అయితే 24 గంటలలోపు ఒకసారి మాత్రమే ఈ మాత్రను వాడాలి.

Story first published: Thursday, December 9, 2010, 16:51 [IST]

Get Notifications from Telugu Indiansutras