•  

సెక్స్ కు మొబైల్ చిరాకు

Mobile Phone will disturb Sex
 
శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే సెల్ ఫోన్ ను పక్కన పెట్టాలని చెబుతున్నారు ప్రముఖ యోగా గురువు ప్రముఖ యోగా గురువు, పార్లమెంట్ సభ్యుడు, బీజూ జనతా దళ్(బీజేడీ) నాయకుడు ప్రసన్న పాటసానీ. రానున్న ఎన్నికలలో తమ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేదానికి సెక్స్ లైఫ్ బాగుండాలని ఆయన వారికి సూచించారు. వారు తమ జీవితంలో సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని కార్యకర్తలను సూచించారు. వాటిని వాడటం వల్ల మనిషిలో ఒత్తిడిని పెంచుతాయన్నారు.ఇవి మనిషిలోని సెక్స్ కోరికలను చంపేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు కూడా తాను రాజకీయాలతో సంబంధమున్న యువకులకు సూచించానని ఆయన వివరించారు. ఆయన చాలా పుస్తకాలు కూడా రచించారు.

ముఖ్యంగా ప్రేమికులు గంటలకొద్దీ మొబైల్ ఫోన్లలో మాట్లాడుతుంటారు. చివరికి సెక్స్ టైంకు వచ్చేసరికి అక్కడ వారు ఫెయిల్ అయినట్లు ఆధారాలున్నాయని ఆయన వివరించారు.తన వద్దకు చాలామంది లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర వ్యక్తులు తాము తీసుకోవలసిన డైట్ గురించి, వారి ఆరోగ్యం గురించి, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సలహాల కోసం వస్తుంటారు. వారికి తన సలహాలు పాటించడంవలన జీవితం చాలా సుఖంగా గడచిపోతోందని వారు తెలిపినట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా మొబైల్ ఫోన్‌ను వాడనటువంటి ఏకైక లోక్‌సభ సభ్యునిగా ప్రసన్న చరిత్రలో నిలిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు.

తన అరవై ఐదేళ్ళ వయసులోకూడా ఆయన చాలా చలాకీగా ఉంటారు. ఒత్తిడి అనే మాటే ఆయన దరి చేరదు. గత ముఫై సంవత్సరాలుగా ఆయన గెలుపుకు సూత్రం తన వ్యక్తిగత పరిచయం, అలాగే తన ల్యాండ్ ఫోన్ మాత్రమేనని ఆయన తరచూ అంటుంటారు. ఐతే దేశం ఐటీ రంగంలో ముందుండాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమున్నంతమేరకే ఏదైనాకూడా వాడలని, అవసరంలేనప్పుడు వాటిని వాడకూడదని కూడా ఆయన సూచించారు.

Story first published: Wednesday, December 8, 2010, 17:05 [IST]

Get Notifications from Telugu Indiansutras