•  

సెక్స్ వేళ స్త్రీలకు నచ్చని చేష్టలు

Men should avoid some acts
 
మహిళ సెక్స్ ‌కు సమాయత్తమవుతున్న తరుణంలో పురుషులు చేసే కొన్ని పనులకు చిర్రెత్తుకొస్తుందట. వాటిలో ప్రధానమైనవాటిని సెక్సాలజిస్టులు తెలిపారు. కొందరు పురుషులు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ భాగస్వామితో సెక్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ సంగీతం మంద్రమైన సంగీతమైతే సరే కానీ సంగీతం పేరుతో ఇంటితోపాటు వీధి మొత్తం వినబడేలా సౌండ్ చేసే పాటలు పెడితే మాత్రం భాగస్వామి నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఆ రోజుకు సెక్స్ కట్ అయిపోతుందంటున్నారు. అందువల్ల సెక్స్ చేసే ముందు మూడ్‌ను పాడు చేసే సంగీతాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. సెల్ ఫోన్ శృంగారానుభూతుల్ని పంచే పడక గదిలోకి కూడా వచ్చి రొద పెడితే మాత్రం భార్యకు చిర్రెత్తటం ఖాయం అంటున్నారు. సెక్స్‌కు సమాయత్తమై పరిస్థితి రసపట్టులో ఉన్న సమయంలో తలగడన పిచ్చి సంగీతపు కాలర్ ట్యూన్లతో ఫోను చేసే శబ్దాలు శృంగార పట్టును నిస్సారం చేస్తుంది కోరికతో రగిలే శరీరాలు గాలితీసిన బెలూన్లలా వాలిపోతాయి.

సెక్స్‌కు ముందు చేసే సరసం శరీరాలను ఎంతో మత్తెక్కించేదిగా ఉంటుంది. కానీ కొందరు పురుషులు ఏదో తరుముకొస్తున్నట్లు సరససల్లాపాలు సాగిస్తారు. శరీరంపై మృదువుగా నిమురుతూ శృంగారానికి సిద్ధం చేయాల్సింది పోయి సున్నితమైన భాగాలను ఒడిసిపట్టి పిచ్చిగా ప్రవర్తిస్తారు. దీంతో అప్పటివరకూ సెక్స్ సుఖం కోసం ఎదురు చూసిన సదరు మహిళకు ఆ రాక్షస సరసంతో భీతిల్లి ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందట. సెక్స్‌లో పాల్గొనేందుకు భాగస్వామికి ఇష్టమైన సమయాలను మాత్రమే ఎంచుకోవాలి. అలాకాక ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్‌కు సై అని రభస చేస్తే ఆ సమయంలోనే కాదు, ఆ రాత్రికి కూడా సెక్స్‌లో పాల్గొనటానికి భాగస్వామి విముఖత చూపిస్తుందట. అసందర్భమైన సమయంలో ఆ సుఖాన్ని కావాలని పురుషుడు అడగటంపై ఆరోజంతా గరంగరంగా ఉంటుందట. అందువల్ల సెక్స్ చేసే సమయంలో జీవిత భాగస్వామి వద్ద తగిన విధంగా పురుషుడు వ్యవహరించడం మంచిది.

Story first published: Wednesday, December 1, 2010, 16:42 [IST]

Get Notifications from Telugu Indiansutras