రోజుకు ఒక్కసారే సెక్సు

Srungaram
 
రోజుకు ఒక్కసారే సెక్సు చేయటం, అదీ రోజుకు రోజుకు గ్యాప్ తీసుకొని చేయటం మంచిదంట. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి అన్నం తిన్న తరువాత రెండుగంటల తర్వాత సెక్సును ప్రారంభించాలంట, నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది.

స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే.

Story first published: Sunday, December 19, 2010, 16:10 [IST]
Please Wait while comments are loading...