పెళ్లి తర్వాత సెక్స్ డీలా ఎందుకు?

Adverse situation in Sex
 
పెళ్లి చేసుకుంటే సెక్స్ పై అంత ఆసక్తి ఉండదా, పెళ్లికి ముందు రతిపై ఉన్న ఆసక్తి వివాహమైతే సన్నగిల్లుతుందా అంటే అవుననే అంటున్నారు లండన్ పరిశోధకులు. యువకులలో పెళ్లికి ముందు, పెళ్లైన తర్వాత సెక్స్ ఏ రీతిలో ఉంటుందన్న అంశంపై ఆ బృందం పరిశోధక బృందం సర్వే చేపట్టింది. ప్రేమికులుగా ఉన్న ఇరువురు స్త్రీ పురుషులు, పెళ్లితో ఒకటవుదామనుకునే ముందు రతికోసం తహతహలాడతారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుందని తెలిసినప్పటికీ, అంతవరకూ ఆగలేని కపుల్ సెక్స్ సుఖాన్ని అనుభవించేవరకూ నిద్రపోరని తమ సర్వేలో తేలిందంటున్నారు.

పెళ్లవక ముందు వారానికి కనీసం నాలుగైదు సార్లు సెక్స్‌లో పాల్గొనే జంట, పెళ్లి చేసుకున్న రెండు మూడు సంవత్సరాల తర్వాత చూస్తే వారానికి ఒక్కసారి మాత్రమే రతి సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తేలిందంటున్నారు.పెళ్లయిన మూడువేల జంటలపై చేపట్టిన ఈ సర్వేలో ప్రతి పది జంటల్లో ఆరు జంటలు తాము పెళ్లికి ముందు ఎక్కువసార్లు రతిలో పాల్గొనేవారమని చెప్పారు. పెళ్లికి ముందు తమ బాయ్ ఫ్రెండ్ ఎన్నెన్నో తీపి కబుర్లు, అందమైన లోకాలను చూపించేవాడనీ ఇప్పుడు అంతగా పట్టించుకోరని వారు అంటున్నారు.

Story first published: Wednesday, November 24, 2010, 16:50 [IST]
Please Wait while comments are loading...