•  

సెక్స్ పై మహిళలకు అనాసక్తి?

Ladies will not show interest on Sex
 
ఉదయంనుండి పనుల కారణంగా చాలామంది మహిళలకు రతిక్రియలో పాల్గొనాలంటే ఆసక్తి ఉండదు. భర్త దగ్గరకు రాగానే సన్నద్దమౌతున్నప్పుడే ఆహ్, ఊఁ, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ఏదో ఒకటి చెప్పి తమ జీవిత భాగస్వామికి ఆ మూడ్‌ పోయేలా వ్యవహరిస్తుంటారు. కాని నొప్పులు మటుమాయమవ్వాలంటే రతిక్రియలో పాల్గొనడమే అత్యుత్తమమైన ఔషధమంటున్నారు పరిశోధకులు. రతిక్రియలో పాల్గొనాలనే కోరిక మహిళల్లోను ఉంటుంది. కాని పనుల ఒత్తిడి వలన శరీరం అలసిపోతుంది. దీంతో ఆ క్రియలో పాల్గొనాలనే కోరిక చల్లారిపోతుందంటున్నారు పరిశోధకులు. అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది.

కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ క్రియలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారని పరిశోధకులు పేర్కొన్నారు.తమ జీవిత భాగస్వామిని ఆ క్రియకు ప్రోత్సహించడంలో భాగంగా పురుషులు సన్నద్ధం కావాలి. దీనికి అనువైన కార్యకలాపాలు, సరస సల్లాపాలు, మృదువైన, మనసుకు హత్తుకునే నాలుగు ప్రేమ మాటలు మాట్లాడాలి. ఇంటికి రాగానే తరచూ మీ పనుల్లో మీరు బిజీ కాకూడదు. వారితోను కాసేపు ముచ్చటించాలి. వారు చేసే ఇంటి పనుల్లో మీరు తోడుగా కలిసి సహాయపడుతూ వారి మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వారికి ఆ మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు పడిన శ్రమ మర్చిపోయి పడక సుఖాన్ననుభవించేందుకు సిద్ధమౌతారు. ఎప్పుడైతే భార్యా-భర్తలు ఇరువురూ మనస్ఫూర్తిగా రతిక్రియలో పాల్గొంటారో అప్పుడు శరీరంలోని మానసిక, శారీరక ఒత్తిడితోపాటు శరీరంలోనున్న నొప్పులు మటుమాయమౌతాయంట.

Story first published: Monday, November 22, 2010, 16:13 [IST]

Get Notifications from Telugu Indiansutras