తాము నెరిపిన లైంగిక సంబంధాలను తలుచుకుని సిగ్గుపడుతుంటారు. పరిశోధన కోసం శాస్త్రవేత్తలు అమెరికాలోని దాదాపు 14 వేల మంది మానసిక స్థితిని పరిశీలించారు. వీరంతా 14 నుంచి 17 యేళ్ళ మధ్యవయస్కులే. బయటి ప్రభావాలకంటే వారిలోని కోరికలు, భావాలే అధికంగా లైంగిక సంబంధాలకు ప్రోద్బలం చేస్తాయని వెల్లడించారు. రెండుసార్లుకంటే ఎక్కువగా సెక్స్‌లో పాల్గొన్నవారు ఎక్కవగా డిప్రెషన్‌కు లోనవుతారు. దాదాపుగా 19 శాతం మంది ఇలాంటి ఒత్తిడికి లోనవుతున్నట్లు వారు తెలిపారు. కన్నెలుగా ఉన్నవారిని గమనిస్తే ఇలా ఒత్తిడికి గురవుతున్న వారు కేవలం 9.2 శాతం మాత్రమే ఉన్నారు.
ఇదే వయస్సులో ఉన్న బాలల మానసిక స్థితిని గమనించారు. అయితే లైంగిక సంబంధాలు, మానసిక స్థితికి ఎటువంటి సంబంధాలు లేదని తేలింది. మొత్తంపై టీనేజీలో లైగింక సంబంధాలు నెరిపిన బాలికలు మానసికంగా కుమిలిపోతుంటారు.