ఫోర్ ప్లే సందర్భంగా తన పురుష భాగస్వామి దుస్తులను తొలగించడాన్ని ఇష్టపడే మహిళలు 16 శాతం నుంచి 18 శాతానికి పెరిగారని సర్వేలో తేలింది. అయితే, ప్రస్తుత సెక్స్ జీవితం పట్ల సంతృప్తి గ్యాప్ పురుషులకు, స్త్రీలకు మధ్య పెరుగుతోందట. పురుషులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, అసంతృప్తికి గురవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందట. ఫోర్ ప్లేకు పురుషులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. తమ జీవిత భాగస్వాములు సెక్స్ అవసరాల పట్ల సెన్సిటివ్ గా ఫీలవుతున్నట్లు పురుషులు అభిప్రాయపడుతున్నారు.
సెక్స్ పట్ల భారత మహిళలు పెద్దగా ఆసక్తి కనబరచరనే అభిప్రాయం ఉంది. అయితే అభిప్రాయం అపోహ మాత్రమేనని ఓ సర్వే తెలియజేస్తోంది. జీవితంలో సెక్స్ కీలకమైందని 70 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారట. ఇండియా టుడే - ఎసి నెల్సన్ - ఆర్ మార్గ్ ఈ సర్వేను నిర్వహించింది. సెక్స్ జీవితాన్ని ఉద్వేగభరితం చేసుకోవాలని కూడా వారు భావిస్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సెక్స్ చేయవచ్చునని అంటున్నారట. కొత్త పరిస్థితులకు 67 శాతం మంది, కొత్త పొజిషన్లకు 20 శాతం మంది, కొత్త రకాల ఫోర్ ప్లేలను 24 శాతం మంది కోరుకుంటున్నారట. ఆనందమే అత్యంత ముఖ్యమైందని, ఇది తమకే కాకుండా తమ జీవిత భాగస్వామికి కూడా కలగాలని 57 శాతం మంది చెప్పినట్లు సర్వేలో తేలింది.