శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా తయారువుతుంటారు కొంత మంది. ఊబకాయులైన పురుషులను స్త్రీలు ఇష్టపడరని, వారితో సెక్స్ జరిపేందుకు ఇష్టపడరని తమ పరిశోధనల్లో తేలినట్లు జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాంసిస్ క్విర్క్ తెలిపారు. ఊబకాయులు సెక్స్ కు చాలా దూరంగా ఉంటారని అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని ఆయన అన్నారు.
సెక్స్ కు దూరంగా ఉండడానికి వారి శరీరాకృతే కారణమని, లావు ఉండడం వల్ల తమలో తామే కుమిలిపోతుంటారని, దీంతో వారిలో ఆ కోరికలు కూడా తక్కువగానే ఉంటాయనే విషయం తమ పరశోధనల్లో తేలిందని, ప్రధానంగా ఊబకాయమున్న భర్తలంటే ఇష్టపడని మహిళలే అధికంగా ఉంటారని ఆయన తెలిపారు. శరీర బరువు ఉండాల్సిన బరువుకంటే ఎక్కువగా ఉంటే రకరకాల సమస్యలతో సతమతమౌతుంటారని, వీటితోపాటు వారిలో సెక్స్ పై విముఖత పెరుగుతుందని తమ పరిశోధనల్లో తేలిందని ఆయన వివరించారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.