ఆలింగనం, చుంబనాలు, ఇతరత్రా పైపై పనులనే వ్యక్తులు ఇష్టపడుతుండటం గమనార్హం. అలాగే మనుషుల మధ్య పరస్పర అవగాహనా లోపంతో వ్యక్తుల మధ్యనున్న సత్సంబంధాలకు బీటలు వారుతున్నాయని, దీంతోపాటు శృంగారపరమైన అంశాలలోను అంతరాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ పరిశోధకుడు క్రిస్టీన్ వేబర్ తెలిపారు.ఇక కౌగిళ్లు, ముద్దుల విషయంలో పురుషులు మహా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇష్టపడిన అమ్మాయి ఏ సోఫాలోనో ఆశీనురాలై ఉన్నప్పుడు అందరి కళ్లూ కప్పి చటుక్కున కౌగలించుకోవడంతోపాటు ముద్దు రుచిని కూడా చూపిస్తున్నారట. ఇటువంటి పనులతో వారు అమితానందాన్ని పొందుతున్నారని, ఇలాంటి సమయంలో వారికి రతిక్రియలో పాల్గొనాలన్న కోరిక బలీయంగా ఉన్నప్పటికీ దానిని ప్రక్కనపెట్టి మిన్నకుండిపోతున్నారట.
నేటి యువత ఇప్పుడు శృంగారానికన్నా చుంబనాలు, ఆలింగనాలనే ఇష్టపడుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడయింది. టీనేజ్‌లో సెక్స్ - ముద్దు, కౌగిళ్లు అనే అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది.సర్వేలో భాగంగా సాహచర్యం, నవ్వులు, జోకులతోపాటు యవ్వన సంబంధాలు గురించి తాము సర్వే నిర్వహించామన్నారు. సెక్స్ సంబంధాలకన్నా ఆలింగనాలు, చుంబనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారనీ, ముఖ్యంగా పురుషులు సెక్స్ సంబంధాలపై మక్కువ చూపడం లేదని తమ సర్వేలో తేలింది.