ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషన్స్‌పై కండోమ్స్‌పై అవగాహన కల్పించే నిమిత్తం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), వరల్డ్ ఇనిస్టిట్యూట్‌లు కలసి తాజాగా ఒక సదస్సును నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా, ఐటీ సంస్థల్లో కండోమ్స్ మెషన్స్‌ అమర్చేందుకు ఆ సంస్థల యాజమాన్యం అంగీకరించడం లేదని ప్రతినిధులు వాపోయారు. అలాగే, కళాశాలలు, పాఠశాలల్లో కూడా కండోమ్స్ మెషన్స్ అమర్చాలని ప్రతినిధులు కోరారు.
ఐటీ సంస్థల్లో పని చేస్తున్నమహిళల్లో సెక్స్ వాంఛలు ఎక్కువగా ఉన్నట్టు ఆ మధ్య ఓ సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా విలాసవంతమైన, స్వేచ్ఛాజీవితానికి అలవాటు పడిన మహిళలు తమ కామ వాంఛలు తీర్చుకునేందుకు సహచర సిబ్బందితో ఇష్టమైన సమయంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తేలింది. అంతేకాకుండా కండోమ్‌లు కేవలం గర్భ నిరోధక సాధనాలుగా మాత్రమే పని చేస్తున్నాయని, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను అరికట్టేందుకు దోహదపడటం లేదనే అపోహ వారిలో ఎక్కువగా ఉంది.