•  

సెక్స్ లైఫ్ లో ఫాంటసీ అవసరమా?

Sex Life
 
మనిషి జీవితంలో శృంగారానికి ఓ విశిష్టమైన స్థానముంది. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ఓ వయసు తర్వాత శృంగార జీవితం అంతే ముఖ్యం. మిగిలిన విషయాల్లాగా శృంగార జీవితంలో మనిషి సర్ధుబాటు ప్రదర్శించలేడు. ఎందుకంటే ఎగసిపడే వాంఛ ఈ విషయంలో మనిషిని కుదురుగా ఉండనీయదు. కాబట్టే శృంగారానికి సంబంధించిన విషయాల్లోనే మనిషి కొన్నిసార్లు విచక్షణ తప్పి ప్రవర్తిస్తుంటాడు. ఇలాంటి సందర్భాల్లో మనిషి అదుపు తప్పకుండా ఉండడానికి ఫాంటసీలు ఓ వరంలా ఉపయోగపడుతాయి. ఫాంటసీలు అంటే ఊహలని చెప్పవచ్చు. నిజజీవితంలో చేయలేని, వీలుకాని కొన్ని విషయాలకు అందమైన దృశ్యరూపమే ఈ ఫాంటసీలు. చాలా విషయాల్లో మనిషికి ఫాంటసీలు వచ్చే అవకాశమున్నా తమ శృంగార జీవితానికి సంబంధించి మనిషి ఎక్కువగా ఈ ఫాంటసీల్లో విహరిస్తుంటాడు.

నాజూకైన నడుము, కసెక్కించే చూపులు, రెచ్చగొట్టే పరువాలు ఇలా మగాడిలో శృంగార భావాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే లక్షణాలున్న స్త్రీని వద్దనే పురుషుడుంటాడా. కానీ అందరి నిజ జీవితంలో సరిగ్గా ఇలాంటి భాగస్వామే దొరకడం బహు అరుదు. అలాంటప్పుడు నిజంగా దొరకని ఈ లక్షణాలని ఫాంటసీ లోకంలో చూసి తరించడం చాలా మందికి అనుభవమే. ప్రతి వారి జీవితంలో వారు ఆడైనా, మగైనా తమ జీవిత భాగస్వామికి సంబంధించి ఏర్పరచుకున్న ఊహలన్నీ నెరవేరడం కష్టం. ఇలాంటి సమయాల్లో ఫాంటసీల్లో విహరిస్తూ తద్వారా కలిగిన తృప్తితో నిజజీవితంలో సం 'తృప్తి' తో బ్రతికేయడం ఓ విధంగా మంచిదే.

ఓ అధ్యయనం ప్రకారం 70 నుంచి 80 శాతం దంపతులు శారీరకంగా తమ జీవిత భాగస్వామితో శృంగారం చేస్తున్నా వారి ఊహల్లో మాత్రం వేరొకరు ఉంటున్నారట. సెక్స్ వైద్య నిపుణులు సైతం ఇలా ఫాంటసీల్లో విహరించడం తప్పేమీ కాదని అంటున్నారు.ఎందుకంటే తమ జీవిత భాగస్వామిలో అదిలేదు, ఇదిలేదని అసంతృప్తితో బాధపడి జీవితాన్ని నరకం చేసుకునే కన్నా ఫాంటసీల్లో అప్పుడప్పుడు విహరిస్తూ జీవితంలో ఆనందంగా ఉండడమే మేలని వారు వివరిస్తున్నారు. అయితే ఫాంటసీలైనా, ఊహలైనా ఏదైనా సరే ఓ పరిమితి వరకు ఉంటే అది ఆనందమే. కానీ ఆ ఫాంటసీలు హద్దు మీరితే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే అవసరానికి ఫాంటసీల్లో విహరించవచ్చు కానీ ఎల్లప్పుడూ ఫాంటసీలే లోకంగా బ్రతికేద్దామనుకుంటే మాత్రం నిజ జీవితంలో కష్టాలు తప్పకపోవచ్చని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి హద్దు మీరనంత వరకు మనిషి శృంగార జీవితంలో ఫాంటసీలు కూడా మంచివే.

Story first published: Tuesday, November 9, 2010, 17:59 [IST]

Get Notifications from Telugu Indiansutras