•  

పాలిండ్లు(వక్షోజాలు) చిన్నగా ఉంటే మగవారు ఇష్టపడరా..

kamasutra
 
వక్షోజాలు చిన్నగా ఉండకుండా చాలా ఎత్తుగా ఉంటేనే మగవారు ఇష్టపడతారని మహిళలు అనుకుంటారు. అందులో కొంతమేర నిజం కూడా ఉంది. అయితే పూర్తిగా మాత్రం కాదు. వక్షోజాలు పెద్దగా లేకున్నా కొందరు పురుషులు ప్రేమ చూపిస్తారు. అయితే వక్షోజాలు చిన్నగా ఉంటే వారు వాటిని పెద్దగా మార్చుకునే అవకాశం ఉందా. అంటే కొద్గిగా మార్చుకోవచ్చు.స్త్రీలలో ఎక్కువమంది బాధపడేది తమ వక్షోజాల పరిమాణం గురించే. తమ వక్షోజాలు బాగా ఎత్తుగా పెద్దవిగా ఉంటే మగాళ్లు ఇష్టపడతారని స్త్రీలు అనుకోవడం సహజమే. వివాహం, కానుపు తదనంతర పరిణామాల వల్ల ఆడవారి వక్షోజాలు చిన్నగాగానీ పెద్దగాగాని మారుతాయి.

కొందరు స్త్రీలలో వక్షోజాలు గుండ్రంగా ఉంటే, మరికొందరివి జారినట్లు, ఇంకొందరికి చనుమొనలు ముడుచుకుపోయి ఉంటాయి. కొన్ని చనుమొనలు ముందుకు పొడుచుకువచ్చినట్లు ఉంటే కొన్ని సమాంతరంగా కనిపిస్తాయి. చాలామందిలో రెండు వక్షోజాలు, రెండు చనుమొనలు ఒకే పరిమాణంలో ఉండవు. ఇది సహజమే. తమకున్న అందాలతో సెక్స్‌లో పాల్గొని ఆనందించాలి తప్ప వాటి ఆకృతుల గురించి బెంగపడకూడదు.

వక్షోజాలు పెద్దవీ, చిన్నవీ అనే ఆలోచనకు తావే రానీయకూడదు. చిన్నసైజు వక్షోజాలతో బాధపడేవారు వక్షోజాల కింద ఉండే కండరాలకి బలాన్నిచ్చే వ్యాయామం చేయడం వల్ల కొంతవరకూ వాటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అప్పటికీ ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే కాస్మొటిక్ సర్జన్‌తో ఆగ్‌మెంటేషన్ మామోప్లాస్టీ చేయించుకుని పాలిండ్లను పెద్దవిగా చేసుకోవచ్చు.

Story first published: Friday, November 26, 2010, 17:05 [IST]

Get Notifications from Telugu Indiansutras