తరచూ నలభై ప్రాయంలోకి వచ్చే సరికి పురుషులు లేదా స్త్రీలలో సెక్స్, రొమాన్స్‌కు సంబంధించిన పలు కోరికలు చచ్చిపోతాయని, తాము ముసలి వయసుకు దరిదాపుల్లోకి వచ్చేసినట్లు తెగ ఫీల్ అయిపోతుంటారు. కాని మనిషి శరీరంలో సెక్స్ కు సంబంధించిన కోరికలు, ఆలోచనలు చనిపోయేంత వరకుంటాయని పరిశోధకులు తెలిపారు. వయసు పెరిగినా మనసుకు వయసు పెరగదంటున్నారు పరిశోధకులు. రొమాన్స్ లేదా సెక్స్ కు సంబంధం వయసుకాదని, అది మనసుతో ముడిపడివుంటుంది. 70-80ల్లోను సెక్స్ తమ జీవిత భాగస్వామితో రంజుగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు.
రొమాన్స్ సాగించేందుకు వయసుతో నిమిత్తం ఉంటుందా అని వయసుపైబడిన ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంటుంది. ప్రతి మనిషి తమ జీవిత కాలంలో అత్యధికంగా రొమాన్స్, సెక్స్ జరిపాలనే ఆలోచనలతోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటాడని పరిశోధకులు తెలిపారు. కాని వయసు పైబడే కొద్ది తమలో ఆ కోరికలుండవని అపోహపడుతుంటారు. దీంతో ఇంట్లో జీవిత భాగస్వామితో రొమాన్స్ సాగించేందుకు వెనకాడుతుంటారని తమ పరిశోధనలో వెల్లడైనట్లు బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.